ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత మూడు రోజులుగా కేరళ, తమిళనాడు దేవాలయాల సందర్శనార్ధం కొడుకు అకీరా నందన్ తో కలిసి వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా పవన్ ఈరోజు విజయవాడలో జరుగుతున్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మ్యూజికల్ నైట్ లో పాల్గొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు సాదర ఆహ్వానం పలకగా భువనేశ్వరి పూల బొకే తో పవన్ కు వెల్ కమ్ చెప్పారు.
ఈ ఈవెంట్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ తనలోని సేవ గుణాన్ని మరోమారు నిరూపించుకున్నారు. తాను టికెట్టు కొనకుండా ఈ షో కి రావడం గిల్టీగా ఉంది అంటూ సేవ కార్యక్రమాలు చేపడుతున్న ఎన్టీఆర్ ట్రస్ట్ కు విరాళం ప్రకటించారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆధ్వర్యంలో సాగుతున్న ఈ కార్యక్రమం ద్వారా వచ్చే మొత్తాన్ని తలసేమియా వ్యాధిగ్రస్తుల చికిత్స కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ వినియోగించనుంది. దాని కోసం పవన్ కూడా భారీ విరాళం ప్రకటించారు.
తలసేమియా వ్యాధిగ్రస్తుల చికిత్స కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ తన వంతుగా రూ.50 లక్షల భారీ విరాళాన్ని ట్రస్ట్ కు అందజేశారు. గతంలోనే పవన్ కళ్యాణ్ దయ గుణాన్ని పలు సందర్భాల్లో బయట పెట్టారు. తాజాగా పవన్ దాన గుణం ఈ మ్యూజికల్ నైట్ లో మరోసారి బయటపడింది అంటూ పవన్ ఫ్యాన్స్ పవన్ ని పొగిడేస్తున్నారు.