నేడు సంచలన ప్రకటన వెలువడింది. తమిళనాట TVK పార్టీ పెట్టిన స్టార్ హీరో విజయ్ కు కేంద్ర ప్రభుత్వం Y ప్లస్ సెక్యూరిటీ కేటాయించింది. ఓ సాధారణ నటుడికి ఇంతటి స్థాయి రాదు. రాజకీయపార్టీ నాయకుడిగా ఉద్భవించడం వలనే ఇది సాధ్యమైంది. పైగా బీజేపీ కదుపుతున్న ప్రతి పావు తమిళనాడు రాజకీయాలపైనే కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ DMK పార్టీపై విమర్శలు వెలువడుతున్న వేళ జయలలితను కోల్పోయి, AIDMK పార్టీ ఉనికి కోల్పోతున్న వేళ కొత్త పార్టీ తో రంగంలోకి దిగిన విజయ్ ను అక్కున చేర్చుకోవాలని, అతనితో కూటమి కట్టాలని బీజేపీ ముందు నుంచే ప్రయత్నిస్తుంది. అందుకు నిదర్శనంగా ఎన్నో జరిగాయి, జరుగుతున్నాయి.
అజిత్ కు పద్మ భూషణ్ ఇచ్చిన సందర్భంలో కూడా విజయ్ కు బీజేపీ ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చింది అనే వ్యాఖ్యలు వెలువడ్డాయి. మొత్తానికి విజయ్ దారిలోకి వచ్చినట్టు ఉన్నారు. ఉన్నట్టుండి విజయ్ కు Y కేటగిరి భద్రతను కేటాయించేసింది. నేరుగా కేంద్ర ప్రభుత్వమే ఓ ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడికి Y కేటగిరి భద్రత కల్పించింది అంటే అర్ధం చేసుకోవచ్చు ఆ వెనుక ఉన్న ఒప్పందాలు.
ఇదిలా ఉంటే మోడీ అమితంగా ఇష్టపడే అతని తుఫాన్ పవన్ ను ప్రస్తుతం ఆధ్యాత్మిక పర్యటనకు నియమించారు. నడుం నొప్పితో బాధపడుతున్నాను అని చెప్పిన పవన్ ప్రస్తుతం మాత్రం కాషాయ వస్త్రాలు ధరించి కొడుకుని వెంటపెట్టుకుని చకా చకా దక్షిణాది పుణ్యక్షేత్రాలు చుట్టేస్తున్నారు. ఇదంతా ఎందుకు అంటే దీని వెనుక చాలా పొలిటికల్ స్ట్రాటజీ ఉంది అంటున్నారు విశ్లేషకులు. ఆయా ప్రత్యేక ప్రాంతాల్లో పవన్ పర్యటన వెనుక చాలా రీజన్స్ ఉన్నాయని, వచ్చే ఏడాది జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో ఎంతో ప్రభావం చూపిస్తాయని రాజకీయ లెక్కలు చిక్కగా చెబుతున్నాయి.
సో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు రీత్యా రాబోయే భవిష్యత్తును అంచనా వేస్తె ఖచ్చితంగా పవన్-విజయ్ కలయికను ఓ స్టేజ్ పై చూడబోతున్నాం. తమిళనాడు రాష్ట్ర రాజకీయాలను ఈ కలయిక ఎలా తిరగ రాస్తుందో వెయిట్ చేద్దాం.