ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లు నుంచి సోలో పోస్టర్స్ మాత్రమే బయటికొచ్చాయి. క్రిష్ డైరెక్టర్ గా ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ యుద్ధ శిక్షణ, మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటున్న వర్కింగ్ స్టిల్స్, పవన్ కళ్యాణ్ వీరమల్లు యాక్షన్ లుక్స్ రివీల్ చేసారు. అటు హీరోయిన్ నిధి అగర్వాల్ బర్త్ డే స్పెషల్ గా ఆమె లుక్ వదిలారు.
ఇక తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా హరి హర వీరమల్లు నుంచి రొమాంటిక్ పోస్టర్ వదిలారు. హరి హర వీరమల్లు సెకండ్ సాంగ్ ప్రోమో కి సంబందించిన పోస్టర్ అది. నిధి అగర్వాల్ రాణి లుక్ లో బ్యూటిఫుల్ గా ఉండగా.. పవన్ కళ్యాణ్ వీరమల్లు గా ఆమె వెనుక పడుతున్న పోస్టర్ చూసి ఎన్నాళ్లకు వీరమల్లు రొమాన్స్ చూసాం అంటూ పవన్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.
హరి హర వీరమల్లు డ్యూయెట్ సాంగ్ ఈనెల 24 న రిలీజ్ అంటూ అందుకు సంబందించిన అప్ డేట్ ని ఇలాంటి రొమాంటిక్ పోస్టర్ తో చెప్పారు. ఇక సినిమా మార్చ్ 28 న పక్కాగా రిలీజ్ అంటూ మేకర్స్ పదే పదే ప్రకటిస్తున్నారు. సో అదే రోజు వీరమల్లు రాక ఉంటుంది.