ఇటీవల మళయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన సెన్సేషనల్ హిట్‌లలో ఉన్ని ముకుందన్ నటించిన మార్కో ఒకటిగా నిలిచింది. హనీఫ్ అదేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మళయాళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా విడుదలై మంచి విజయం సాధించింది. అయితే థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఓటిటిలో మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
ఈ సినిమాను చాలా మంది అన్ కట్ వెర్షన్ లో చూడాలని ఎదురు చూశారు. కానీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లో ఆ వెర్షన్ విడుదల కాలేదు. దీనిపై ప్రేక్షకులు తమ నిరాశను వ్యక్తం చేయగా మేకర్స్ దీనిపై స్పష్టతనిచ్చారు. వారు మొదటగా అన్ కట్ వెర్షన్‌ను ఓటీటీలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారని కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది సాధ్యపడలేదని తెలిపారు. భవిష్యత్తులో ఆ వెర్షన్ విడుదల చేసే అవకాశముందా ? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా రవి బస్రూర్ పని చేశారు. ప్రస్తుతం మార్కో మూవీ సోనీ లైవ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో దూసుకెళ్లిన ఈ సినిమా ఓటీటీలో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడం గమనార్హం.