Advertisement
Google Ads BL

క్రేజీ కాంబినేషన్ పట్టాలెక్కుతుందా


టాలీవుడ్‌లో మాస్ కమర్షియల్ సినిమాల్ని స్టైలిష్‌గా తెరకెక్కించే దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకరు. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌తో తనదైన ముద్ర వేసుకున్న ఆయన ఆ తర్వాత అదే స్థాయి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. ఇటీవల విడుదలైన మిస్టర్ బచ్చన్ ఆశించిన విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో బాలకృష్ణతో సినిమా చేయాలని హరీష్ శంకర్ గత కొంత కాలంగా అనుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ చివరికి కుదిరినట్టు తెలుస్తోంది.

Advertisement
CJ Advs

ఇన్‌సైడ్ టాక్ ప్రకారం హరీష్ శంకర్ బాలకృష్ణకు ఓ స్టోరీ లైన్ చెప్పగా అది ఆయనకు బాగా నచ్చిందట. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించనుంది. ప్రస్తుతం కన్నడ స్టార్ యశ్ హీరోగా టాక్సిక్ సినిమాను నిర్మిస్తున్న ఈ సంస్థ తెలుగులో బాలయ్యతో ఒక భారీ ప్రాజెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి చర్చలు సాగుతున్నాయి త్వరలో అధికారిక ప్రకటన రానుంది.

హరీష్ శంకర్ మీద రీమేక్ డైరెక్టర్ అనే ముద్ర ఉంది. ఆయన గత చిత్రాల్లో చాలా వరకు రీమేక్‌లే. గబ్బర్ సింగ్ సూపర్ హిట్ అయినా మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయినా రెండూ రీమేక్‌ సినిమాలే. అయితే ఈసారి బాలయ్య కోసం ఓ ఒరిజినల్ కథను సిద్ధం చేశారని టాక్. మాస్ సినిమాల్లో తన స్టైల్ చూపించడంలో దిట్ట అయిన హరీష్, ఈ సినిమా ద్వారా రీమేక్ డైరెక్టర్ అనే ట్యాగ్‌ను చెరిపేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం బాలకృష్ణ కెరీర్ అగ్రగామిగా సాగుతోంది. ఆయన చేసిన ప్రతి సినిమా ఘనవిజయం సాధిస్తోంది. ఈ క్రమంలో హరీష్ శంకర్‌కి బాలయ్యతో సినిమా చేయడమే పెద్ద అవకాశంగా మారింది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే హరీష్ మళ్లీ టాప్ డైరెక్టర్ లిస్ట్‌లోకి వెళ్లే అవకాశం ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెలువడనున్నాయి.

Harish Shankar and Balakrishna film on Cards:

Balayya to Team Up with Harish Shankar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs