గన్నవరం మాజీ ఎమ్యెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు ఈరోజు హైదరాబాద్ లోని గచ్చిబౌలి లో అరెస్ట్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్ఛాక ఎక్కడ తనని కేసులు పెట్టి అరెస్ట్ చేస్తుందో అనే భయంతో అమెరికా వెళ్ళిపోయినట్టుగా కలరింగ్ ఇచ్చిన వల్లభనేని వంశి హైదరాబాద్ లోని మైహోంభూజా లో సీక్రెట్ గా నివాసముంటున్నాడు.
అయితే టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వల్లభనేని వంశి ముద్దాయిగా ఉన్నాడు. రెండురోజుల క్రితం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసుని విత్ డ్రా చేసుకున్న సత్యమూర్తిని వల్లభనేని వంశి బెదిరించి కిడ్నప్ చేసి కేసు వెనక్కి తీసుకునేలా చేశాడంటూ వల్లభనేని వంశీ పై కేసు నమోదు కావడంతో మైహోంభూజాలో సైలెంట్ గా ఉంటున్న వంశీ ని పోలీసులు కనిపెట్టి ఇంటికి నోటీసులు అంటించి మరీ అరెస్ట్ చెయ్యడానికి వెళ్లారు.
తనని వెతుక్కుంటూ వచ్చిన పోలీసులు చూసి ఒకింత షాకయిన వంశీ.. డ్రెస్ చేంజ్ చేసుకుంటానని బెడ్ రూమ్ కి వెళ్లి బ్లూ మీడియాకి ఫోన్ చేసి చేసి బ్లూ మీడియా అక్కడికి చేరుకునేవరకు వెయిట్ చేసి పోలిసుల ముందుకు రావడంతో పోలీసులు కూడా షాకయ్యారని తెలుస్తుంది.
అంతేకాకుండా వంశీ మరికొంతమంది వైసీపీ నేతలకు ఫోన్ లు చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం రోడ్డు మార్గాన వంశీని విజయవాడ తరలిస్తున్నారు, ఇప్పటికే గన్నవరంలో వంశీ అనుచరులు ఎలాంటి అల్లర్లకు పాల్పడకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసారు.