సంక్రాంతికి విడుదలైన గేమ్ చేంజర్ చిత్రం ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. మరోపక్క సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ కన్నా ముందే బుల్లితెర మీద సందడి చెయ్యడానికి రెడీ అవుతున్నా అదే సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్ ఓటీటీ స్ట్రీమింగ్ పై ఎడతెగని సస్పెన్స్ నడుస్తుంది.
బాబీ కొల్లి డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటంది. ఈ సినిమాలో బాలయ్య పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే డాకు మహారాజ్ థియేటర్స్ లో విడుదలై ఈరోజుకి నెల పూర్తవడంతో ఓటీటీ డేట్ పై ఆడియన్స్ ఆతృతగా కనిపిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం డాకు మహారాజ్ ఓటీటీ డేట్ డిలే అవడానికి కారణం..
డాకు మహారాజ్ చిత్రానికి సంబంధించి ఇతర భాషలలో డబ్బింగ్ చేసిన కంటెంట్ నెట్‌ఫ్లిక్స్‌కు చేరలేదని తెలుస్తోంది. అందుకే నెట్ ఫ్లిక్స్ డాకు మహారాజ్ ఓటీటీ డేట్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టాక్ వినబడుతుంది. అది మరింత ఆలస్యమైనా ఆశ్చర్యపోవక్కర్లేదు అంటున్నారు.