Advertisement
Google Ads BL

సాయి పల్లవిని డామినేట్ చేసిన చైతు


టాలీవుడ్‌లో సాయి పల్లవికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె పేరు వినిపించినా సరే ఆ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడతాయి. ఆమె నటన కోసం థియేటర్లకు వెళ్లిన రోజులు కూడా ఉన్నాయి. సహజమైన నటనతో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ తాజాగా తండేల్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించారు.

Advertisement
CJ Advs

ఈ సినిమా విడుదలకు ముందు సాయి పల్లవి తన సహజమైన అభినయంతో మరోసారి మెప్పిస్తుందని అందరూ భావించారు. నిజానికి ఆమె ఈ సినిమాలో కూడా తన నటనతో ఆకట్టుకుంది. కానీ అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి మాత్రం హీరో నాగచైతన్య. తండేల్ చూసిన ప్రేక్షకులంతా ఈ సినిమాలో చైతూ పర్ఫార్మెన్స్ అతని కెరీర్‌లోనే అత్యుత్తమమైనదని అభిప్రాయపడుతున్నారు.

ఈ ప్రాజెక్టును ఎంతో ప్రాముఖ్యతనిస్తూ తన వంతు శ్రమను పూర్తిగా పెట్టి నటించాడని అభిమానులు చెబుతున్నారు. ఆయన నటన ఎమోషన్లు ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేసిన సాయి పల్లవిని ఎవరూ డామినేట్ చేయలేకపోయారు. కానీ ఈ చిత్రంలో నాగచైతన్య తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించాడని అంటున్నారు. అతని అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పాలి.

Sai Pallavi is dominated by Chaithu:

Sai Pallavi is dominated by Chaithu in Thandel movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs