Advertisement
Google Ads BL

కేసీఆర్ పగటి కలలు


2023 లో తెలంగాణ లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత గత ఏడాది కాలంగా ఫామ్ హౌస్ కె పరిమితమైన కేసీఆర్ మధ్యలో లోక్ సభ ఎన్నికల సమయంలో రోడ్ షోస్ అంటూ హడావిడి చేసిన తెలంగాణ లో బీఆర్ఎస్ కు జీరో సీట్స్ రావడంతో మళ్లీ కేసీఆర్ కామ్ అయ్యారు. కవిత జైలు కెళ్ళడం, అటు కేటీఆర్ విచారణకు హాజరవడం, పలువురు బీఆర్ఎస్ ఎమ్యెల్యేలు, నేతలు కాంగ్రెస్  పార్టీలోకి చేరిపోవడం ఇవన్నీ కేసీఆర్ ని నిరాశపరిచాయి. 

Advertisement
CJ Advs

తెలంగాణ లో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో మరోసారి కేసీఆర్ యాక్టీవ్ అయ్యారు. అందులో భాగంగా తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని కేసీఆర్ జోస్యం చెబుతున్నారు. ముందుగా స్టేషన్ ఘన్‌పూర్‌లో ఉప ఎన్నిక వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఉప ఎన్నికల్లో కడియం శ్రీహరి ఓటమి తప్పదని ఆయన స్పష్టం చేశారు. 

సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరారు. అంతేకాదు బీఆర్ఎస్‌ పార్టీలోని పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

స్టేషన్ ఘన్‌పూర్‌లో ఉప ఎన్నిక వస్తే.. పార్టీ ఫిరాయించిన కడియం శ్రీహరి ఓటమి తప్పదంటూ కేసీఆర్ జోస్యం కాదు కలలు కంటున్నారు అంటూ కాంగ్రెస్ నేతలు కామెంట్ చేస్తున్నారు. శ్రీహరి ఓడిపోయి రాజయ్య ఈ ఉపఎన్నికలో గెలుస్తారు అంటూ కేసీఆర్ చెబుతున్నారు. 

KCR daydreams:

Former MLA Thatikonda Rajaiah Meets KCR at Erravalli farmhouse
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs