వైసీపీ అధికార ప్రతినిధి రోజా కు జగన్ షాక్ ఇవ్వబోతున్నారా అంటే బ్లూ మీడియా కూడా అదే మాట్లాడుతుంది. నగరి ప్రస్తుత ఎమ్యెల్యే టీడీపీ నేత తమ్ముడు నగరిలోకి ఎంటర్ అయ్యి వైసీపీ లో చేరేందుకు సిద్ధం అవడం రోజాకు షాక్ అయితే.. గాలి జగదీశ్ ను నగరి అభ్యర్థిగా జగన్ ప్రకటిస్తారనే వార్తల నేపథ్యంలో రోజా కామ్ గా ఆలయాల దర్శనానికి వెళ్లిపోవడం హాట్ టాపిక్ అయ్యింది.
ఈరోజో రేపో గాలి జగదీశ్ వైసీపీ లోకి చేరేందుకు ముహూర్తం ఖరారైంది. అయితే ఈసారి రోజాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి జగన్ తప్పించబోతున్నారనే వార్త విని హర్ట్ అయిన రోజా నగరిలో లేకుండా గుడులు తిరుగుతుంది, ఆమెకు జగన్ నిర్ణయం నచ్చలేదు కాబట్టే జగన్ ను కలవకుండా తప్పించుకు తిరుగుతుంది అంటున్నారు.
గాలి జగదీశ్ రోజా ప్రత్యర్థి, అలాంటి జగదీశ్ వైసీపీ లోకి వస్తే రోజా ప్రాధాన్యత ఖచ్చితంగా తగ్గుతుంది. మరి రోజా ఈ విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, జగన్ చెప్పింది వింటుందా, లేదంటే ఈ విషయంలో సైలెంట్ అవుతుందా అనేది అందరిలో మొదలైన ప్రశ్న.