గత ఏడాది గుంటూరు కారం రిజల్ట్ తో త్రివిక్రమ్ అంత సంతృప్తి పడలేదు. అలా వైకుంఠపురములో తర్వాత పెరిగిన అంచనాలను గుంటూరు కారం అందుకోలేకపోయింది. ఆ చిత్రం తరవాత త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో మూవీ అనౌన్స్ చేసారు. అయితే త్రివిక్రమ్ అప్పటి నుంచి స్టిల్ ఇప్పటివరకు అల్లు అర్జున్ మూవీపైనే కూర్చున్నారని అనుకుంటున్నారు.
ఇంకా అల్లు అర్జునే లేట్ చేస్తు వస్తున్నాడు, త్రివిక్రమ్ రెడీ అనుకుంటే.. ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత రిలాక్స్ అయ్యి త్రివిక్రమ్ మూవీ కోసం రెడీ అయినా.. త్రివిక్రమ్ ఇంకా ప్రీ ప్రొడక్షన్ కోసం సమయం తీసుకొంటున్నారు అని తెలుస్తోంది. విజువల్ గా కొంత ప్రీ వర్క్ చేయాల్సిన అవసరం ఉన్న సినిమా కాబట్టి ఎక్కువ సమయం తీసుకుంటున్నారట.
ఇలాంటి సమయంలోనే అల్లు అర్జున్ తో అట్లీ మూవీపై అటూ వార్తలు మొదలైపోయాయి. త్రివిక్రమ్ ప్రీ ప్రొడక్షన్ లేట్ అయితే అల్లు అర్జున్ ముందుగా అట్లీ మూవీ మొదలు పెట్టేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు అంటున్నారు. గత నాలుగు రోజులుగా అల్లు అర్జున్-అట్లీ కాంబో పై వస్తున్న వార్తలు చూశాక ఏంటి త్రివిక్రమ్ ఇంత లేట్ అంటూ అల్లు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.