రామ్ చరణ్ ప్రస్తుతం RC 16 షూటింగ్ లో బిజీగా వున్నారు. బుచ్చి బాబు దర్శకత్వంలో రామ్ చరణ్-జాన్వీ కపూర్ జంటగా RC 16 ని భారీగా తెరకెక్కిస్తున్నారు. పెద్ది(వర్కింగ్ టైటిల్) తో తెరకెక్కుతున్న ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతుంది. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ లో శివ రాజ్ కుమార్, జగపతి బాబు లాంటి క్రేజీ స్టార్స్ నటిస్తున్నారు.
ఇక RC 16 పూర్తి కాగానే.. రామ్ చరణ్ సుకుమార్ తో తన తదుపరి మూవీ ని స్టార్ట్ చేస్తారు. సుకుమార్ పుష్ప 2 తర్వాత రామ్ చరణ్ తో మూవీ కోసం ప్రిపేర్ అవుతున్నారు. అయితే తాజాగా రామ్ చరణ్ RC 18 పై ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. హాయ్ నాన్న దర్శకుడు శౌర్యువ్ తో రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఉండే ఛాన్స్ ఉంది.
అసలు ఈ కాంబో ఎలా సెట్ అయ్యింది. రామ్ చరణ్ తో శౌర్యువ్ ఎలాంటి సినిమా చేస్తారు. ఈ కాంబోనే ఎవరు ఊహించలేదు. శౌర్యువ్ ఎలాంటి కథతో రామ్ చరణ్ ని ఇంప్రెస్స్ చేసాడు, అంటూ మెగా ఫ్యాన్స్ సర్ ప్రైజ్ అవుతున్నారు.