నాగ చైతన్య-శోభితలు రెండేళ్ల ప్రేమను గత ఏడాది డిసెంబర్ లో పెళ్లి బంధంతో ముడివేసుకున్నారు. నాగ చైతన్య-శోభిత ల వివాహం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో అతికొద్దిమంది సన్నిహితుల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత ఈ జంట ముంబైలోని ఓ రిసెప్షన్ కి హాజరయ్యింది.
ఆ తర్వాత సంక్రాంతి ఫెస్టివల్ ను చైతు-శోభితలు పద్ధతి ప్రకారం జరుపుకున్నారు. ఆతర్వాత ఈ జంట మాల్దీవులకు హనీమూన్ ట్రిప్ వెయ్యగా.. ప్రస్తుతం చైతు తండేల్ సక్సెస్ లో రిలాక్స్ అవుతున్నాడు. కాదు కాదు తండేల్ పోస్ట్ ప్రమోషన్స్ తో తలమునకలై ఉన్నాడు. ఈరోజు మంగళవారం తండేల్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నారు.
నాగార్జున గెస్ట్ గా శోభిత స్పెషల్ గెస్ట్ గా ఈ వేడుక జరిగింది. భర్త చైతన్య పక్కనే శోభిత కూర్చుంది. ఇద్దరూ శివ - పార్వతుల్లా ఉన్నారు అంటూ అభిమానులు ముచ్చటపడుతున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి ఓ సినిమా ఈవెంట్ కి హాజరవ్వడం ఇదే మొదటిసారి కావడంతో అక్కినేని అభిమానులు చాలా ఎగ్జైట్ అవుతున్నారు.