సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు నటుడు పృథ్వీ పై వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ విరుచుకుపడుతున్న వీడియోస్, పోస్ట్ లే కనిపిస్తున్నాయి. లైలా ఈవెంట్ లో నటుడు పృథ్వీ 150 మేకలు, 11 మేకలు అంటూ చేసిన కామెంట్స్ వైసీపీ అభిమానులను బాగా హార్ట్ చేసాయి. దానితో బాయ్ కాట్ లైలా హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చెయ్యడంతో టెన్షన్ పడిన టీమ్ మీడియా ముందుకు వచ్చి సారీ చెప్పారు.
దానితో లైలా సినిమాని, టీమ్ ను వదిలేసి.. పృథ్వీ తో సారీ చెప్పించమని వైసీపీ నేతలు, అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. లైలా ఈవెంట్ సమస్య ముగిసినా పృథ్వీ సమస్య సినిమాకి ఎఫెక్ట్ అవ్వడం ఖాయంగా కనబడుతుంది. ఇప్పటికే వైసీపీ కి దగ్గరగా ఉండేవారు రకరకాలుగా మాట్లాడుతున్నారు.
సినిమా వాళ్ళు జగన్ తో జగన్ ఫ్యాన్స్ తో పెట్టుకోకండి.. చాల ప్రమాదం.. జగన్ కి ఉన్న ఓటు బ్యాంకు మాములుగా లేదు, వైసీపీ పై సినిమా వాళ్ళు కామెంట్ చేసే ముందు జగన్ ఓటు బ్యాంకు గుర్తు తెచ్చుకోండి, ఒక్క టికెట్ కూడా తెగదు అంటూ సోషల్ మీడియాలో సినిమా వాళ్ళను భయ పెట్టేలా పోస్ట్ లు పెడుతున్నారు