ఈ సంక్రాంతికి అదే టైటిల్ అంటే సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ తో ఎలాంటి అంచనాలు లేకుండా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి నెక్స్ట్ సంక్రాంతికి కూడా తన సినిమాని రెడీ చేసేలాగే ఉన్నాడు. గత ఏడాది సెప్టెంబర్ లో వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం మొదలు పెట్టి ఈ సంక్రాంతికి అంటే కేవలం నాలుగు నెలల సమయంలో సినిమాని రెడీ చేసి రిలీజ్ చేసి హిట్ కొట్టాడు అనిల్ రావిపూడి.
ఇక తన తదుపరి చిత్రాన్ని అనిల్ రావిపూడి మెగాస్టార్ తో చెయ్యబోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సీనియర్ హీరోలతో సెట్స్ మీదకి వెళుతున్న అనిల్ రావిపూడి ప్రతి హీరోకి హిట్ ఇస్తూ వస్తున్నాడు. ఇప్పుడు మెగాస్టార్ తో అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, చిరంజీవి మార్క్ యాక్షన్ తో కలిసి సినిమాని చెయ్యబోతున్నాడు.
చిరు-అనిల్ రావిపూడి కాంబో కి సంక్రాంతి అల్లుడు టైటిల్ అయితే బావుంటుంది అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అనిల్ రావిపూడి చెవిన పడితే అదే టైటిల్ పెట్టి వచ్చే సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు అంటున్నారు. చూద్దాం రౌడీ అల్లుడు చిరు సంక్రాంతి అల్లుడు అవుతాడేమో..!