కార్తికేయ 2 తో లక్కీగా పాన్ ఇండియా హిట్ కొట్టిన చందు మొండేటి కి తదుపరి మూవీ తండేల్ కూడా అదేమాదిరి బిగ్ సక్సెస్ వస్తుంది అనుకున్నారు. కల కన్నారు. నాగ చైతన్య కూడా పాన్ ఇండియా హీరో గా మారలనుకున్నాడు. కానీ తండేల్ చిత్రం ఆ కలను నెరవేర్చలేదు. తండేల్ పాన్ ఇండియా మార్కెట్ లో వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో తండేల్ చిత్రానికి ఎదురు లేదు. కానీ పాన్ ఇండియాలో తమిళ భాషలో అజిత్ విదాముయార్చి చిత్రం తండేల్ కి తమిళ రిలీజ్ కి ఎఫెక్ట్ అయ్యింది. తమిళ ఆడియన్స్ అజిత్ విదాముయార్చి కి కనెక్ట్ అయ్యి తండేల్ రాజా ను పట్టించుకోలేదు. ఇక కార్తికేయ 2 నార్త్ లో భారీ కలెక్షన్స్ రాబట్టింది.
కానీ తండేల్ చిత్రానికి నార్త్ లో పూర్ ఓపెనింగ్స్, పూర్ రివ్యూస్ రావడమే కాదు.. ముంబై లో చాలా థియేటర్స్ లో తండేల్ షోస్ క్యాన్సిల్ అయ్యాయి. ఫస్ట్ వీకెండ్ లో నార్త్ లో తండేల్ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. అటు నాగ చైతన్య కు తండేల్ తో పాన్ ఇండియా కల నెరవేరలేదు. ఇటు కార్తికేయ హిట్ చందు మొండేటికి వర్కౌట్ అవ్వలేదు.