విక్టరీ వేంకటేష్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం థియేటర్స్ లో దుమ్మురేపే కలెక్టన్స్ తో అద్దరగొట్టేసింది. జనవరి 14 న విడుదలైన ఈ చిత్రం 300 కోట్ల గ్రాస్ తో వెంకటేష్ కెరీర్ లో టాప్ గ్రాసర్ గా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్-మీనాక్షి చౌదరి-ఐశ్వర్య రాజేష్ లు కలిసి నటించిన ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఆదరించారు.
థియేటర్స్ లో బిగ్ హిట్ అయిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని ఎప్పుడెప్పుడు ఓటీటీ లో చూద్దామా అని ఫ్యామిలీ ఆడియన్స్ వెయిటింగ్ లో ఉండగా.. ఈ చిత్ర ఓటీటీ హక్కులను కొనేసిన జీ 5 ఈ వారంలో సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ స్ట్రీమింగ్ అంటూ ప్రకటించింది. కానీ డేట్ లాక్ చెయ్యలేదు.
దాంతో రేపో మాపో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం జీ 5 నుంచి స్ట్రీమింగ్ లోకి వస్తుంది అని అందరూ అనుకుంటున్న సమయంలో జీ 5 వారు బిగ్ ట్విస్ట్ ఇస్తూ.. ముందుగా సంక్రాంతికి వస్తున్నాం జీ తెలుగు అంటే బుల్లితెర మీదకి తీసుకురాబోతున్నారు. జీ 5 నుంచి ఈ వారంలో వస్తుంది అన్నా ఖచ్చితంగా డేట్ ఇవ్వలేదు.
కానీ ఇప్పుడు బుల్లితెర మీద మాత్రం సంక్రాంతికి వస్తున్నాం కమింగ్ సూన్ అంటూ ప్రకటించడం పై ఆడియన్స్ లో కాస్త గందరగోళం నెలకొంది.