గేమ్ చేంజర్ రిజల్ట్ పై అల్లు అరవింద్ తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన కామెంట్స్ మెగా అభిమానులకు కోపాన్ని తెప్పించాయి. ఈ మధ్య దిల్ రాజు చరిత్ర సృష్టించాడు.. అంటే ఒక సినిమాని ఇలా కిందకి దించి.. మరో సినిమాని ఎక్కడికో తీసుకెళ్లి.. మళ్లీ ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌ని ఆహ్వానించి ఇలా రకరకాలు చేశాడు ఒక వారంలో అంటూ మాట్లాడిన అల్లు అరవింద్ పై మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు.
దానితో దిగొచ్చిన అల్లు అరవింద్ ఓ ప్రెస్ మీట్ పెట్టి మెగా ఫ్యాన్స్ కు సారీ చెప్పారు. చరణ్ నా కొడుకు లాంటి వాడు, తండేల్ ఈవెంట్‌లో జరిగిన దాని మీద నేను చెప్పాలనుకున్నది ఒక్కటే. దిల్ రాజు స్టేజ్ పైకి ఆహ్వానిస్తూ ఆయన ఒక్క వారం రోజుల్లోనే కష్టాలు, నష్టాలు, ఇన్‌కమ్ ట్యాక్స్‌లు ఇవన్నీ అనుభవించారు.. అని పరిచయం చేయడానికి మాట్లాడిన మాటలే తప్ప.. ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదు.. ఆ విషయంలో మెగా అభిమానులు చాలా ఫీలై నన్ను ట్రోల్ చేశారు. అలా తప్పుగా అర్ధం చేసుకున్న అభిమానులకి నేను చెబుతున్నాను.. అవి కావాలని మాట్లాడిన మాటలు కాదు.
చరణ్ నా కొడుకు లాంటి వాడు.. నాకున్న ఏకైక మేనల్లుడు.. అతనికి ఉన్న ఏకైక మేనమామని.. అందుకనే ఎమోషనల్‌గా చెబుతున్నాను. ప్లీజ్ ఇక్కడితే వదిలేయండి.. చరణ్‌కి నాకు ఉండే ఒక రిలేషన్‌షిప్ ఎక్సలెంట్. అందుకే చెబుతున్నాను మమ్మల్ని వదిలేయండి. కేవలం పొరపాటున నేను దిల్ రాజు లైఫ్ గురించి చెప్పడానికి అది వాడాను. కానీ వాడి ఉండకూడదని తర్వాత అనిపించింది.. అంటూ అల్లు అరవింద్ ఆ ప్రెస్ మీట్ ల మెగా అభిమానులను కూల్ చేసే ప్రయత్నం చేసారు.