పుష్ప ద రూల్ చిత్రంతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ తోనే మొదలు పెడతారని అనుకున్నారు. గత ఏడాది గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ అల్లు అర్జున్ మూవీ కథపైనే కూర్చున్నారు. అల్లు అర్జున్ కూడా పుష్ప 2 తర్వాత లుక్ మార్చేశారు. అది త్రివిక్రమ్ మూవీ కోసమే అనుకున్నారు.
తీరా చూస్తే కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తో అల్లు అర్జున్ మూవీ మొదలు కాబోతుంది అంటున్నారు. సన్ పిక్చర్స్ నిర్మాణ సారథ్యంలో అల్లు అర్జున్-అట్లీ కాంబో మూవీ తెరకెక్కబోతుంది అంటూ సోషల్ మీడియాలో న్యూస్ లు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్-అట్లీ మూవీ కన్ ఫర్మ్ అంటూ వార్తలు రావడంతో అల్లు ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు.
అంటే త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ మూవీ ముందు మొదలు పెడతారా, లేదంటే వెయిట్ చేయిస్తారా.. అట్లీ తో అల్లు అర్జున్ సినిమా ముందు మొదలవుతుందా అనేది ఇప్పుడు అందరిలో నడుస్తున్న సస్పెన్స్. చూద్దాం అల్లు అర్జున్ ఏ స్టెప్ తీసుకోబోతున్నారో అనేది.