సినిమా ఫంక్షన్స్ లో రాజకీయాల గురించి మట్లాడడం, రాజకీయ సభల్లో సినిమాలపై కామెంట్స్ చెయ్యడం, ఒక సినిమా ఫంక్షన్ కొచ్చి మరొక సినిమా అప్ డేట్స్ ఇవ్వడం, లేదంటే మరొక సినిమాపై సెటైర్స్ వెయ్యడం ఇవన్నీ చాలాకాలంగా జరుగుతున్నవే. ఇక్కడ సినిమా వాళ్ళనే కాదు, జర్నలిస్ట్ లు కూడా అసలు సినిమా ప్రెస్ మీట్ లో వేరే సినిమాల అప్ డేట్స్ పై ఫోకస్ పెట్టి వాళ్ళను ఇబ్బంది పెట్టడం అనేది తరచూ జరుగుతున్న ముచ్చటే.
తాజాగా విశ్వక్ సేన్ నటించిన లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి ప్రొడ్యూసర్ గురించి మాట్లాడుతూ.. ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీనే ఇప్పుడు జనసేన అయ్యింది అంటూ కామెంట్స్ చెయ్యడం ఒక ఎత్తు అయితే.. నటుడు పృథ్వీ అప్పుడు వైసీపీ లో 150 గొర్రెలు ఇప్పుడు 11 గొర్రెలు అంటూ చేసిన కామెంట్స్ పై బయట రకాకల మాటలు వినిపిస్తున్నాయి.
సినిమా ఫంక్షన్స్ లో రాజకీయాల గురించి ఎందుకు, ఇలా జరిగితే కచ్చితం గా ఆ సినిమా కి దెబ్బే అవుతుంది. #Laila అన్ని పార్టీ ల వారు చూస్తేనే సినిమా అందరికీ రీచ్ అవుతుంది, అనవసరపు తలనొప్పి. హీరో విశ్వక్ సేన్ ఏదో ఒక ఓపెన్ విడియో బైట్ ఇచ్చి సర్దుబాటు చేసుకోవాలి. పాపం నిర్మాత అంటూ సోషల్ మీడియాలో నిట్టూర్పులు మొదలయ్యాయి.