ఈమధ్యన సంక్రాంతికి విడుదలైన రామ్ చరణ్ గేమ్ చెంజర్ చిత్రాన్ని విడుదలైన మర్నాడే పైరసీ చేసేసారు. ఆతర్వాత కూడా పలు బస్సు ల్లో గేమ్ చేంజర్ చిత్రాన్ని పైరసీ చేసి ప్లే చేసారు. ఆ పైరసీ వలన నిర్మాతలకు ఎంత నష్టం. గేమ్ చేంజర్ అనే కాదు, ఏ సినిమా విడుదలైనా సాయంత్రానికే అది పైరసీ రూపంలో ఆన్ లైన్ లో దర్శనమిస్తుంది.
తాజాగా విడుదలైన తండేల్ సినిమా ని పైరసీ చేసినవాళ్ళు జైలుకే అంటూ ఆ చిత్ర నిర్మాత బన్నీ వాస్ గట్టి వార్నింగ్ ఇస్తున్నారు. రీసెంట్ గా ఆయన తండేల్ సక్సెస్ టూర్లో మాట్లాడుతూ.. సినిమాని పైరసీ చేసినవాళ్లను, సినిమాను డౌన్లోడ్ చేసుకుని చూసినోళ్లని వదలను.. వాళ్ళను జైలుకు పంపిస్తా అన్ని వార్నింగ్ ఇచ్చారు.
గత శుక్రవారం విడుదలైన తండేల్ చిత్రం పాజిటివ్ టాక్ తో అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఒకవేళ తండేల్ చిత్రాన్ని పైరసీ చేస్తే నిర్మాతలు ఖచ్చితంగా నష్టపోతారు.