Advertisement
Google Ads BL

ఓటీటీ లో గేమ్ ఛేంజర్ హావ


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా ప్రతిష్టాత్మక దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్ గురించి అందరికీ తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఊహించిన స్థాయిలో విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటిటిలో ప్రేక్షకులను ఆకర్షిస్తూ మరోసారి చర్చనీయాంశమైంది.

Advertisement
CJ Advs

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో పొందగా ప్రస్తుతం హిందీ తప్ప మిగతా భాషల్లో ప్రసారం అవుతోంది. థియేటర్లలో ఊహించిన స్థాయిలో రాణించలేకపోయినా ఓటిటిలో మాత్రం ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది.

ఓటిటిలో విడుదలైన తర్వాత ఈ చిత్రంపై మళ్ళీ చర్చ మొదలైంది. కొన్ని సన్నివేశాలు టెక్నికల్ అంశాలకు ప్రశంసలు లభిస్తుండగా కొన్ని అంశాలపై విమర్శలు కూడా వస్తున్నాయి. కానీ ఈ వివాదాలన్నింటినీ అధిగమిస్తూ గేమ్ ఛేంజర్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో భారతదేశవ్యాప్తంగా నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది.

సంగీత దర్శకుడు థమన్ అందించిన సౌండ్‌ట్రాక్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా ఓటిటిలో మంచి స్పందన పొందుతుండటంతో కొత్తగా చూసే ప్రేక్షకులు కూడా ఆసక్తిగా వీక్షిస్తున్నారు.

Game Changer streaming now ott:

Game Changer out on OTT
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs