సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో సంచలన విజయాన్ని నమోదు చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రంగా మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ విషయం ఆయన ఈ సినిమా ప్రమోషన్స్‌లో చెబుతూనే ఉన్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా అనిల్‌తో సినిమాని అధికారికంగా ప్రకటించారు. ఆదివారం జరిగిన విశ్వక్సేన్ లైలా మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో చిరు-అనిల్ రావిపూడి చిత్ర వివరాలను చిరు ప్రకటించారు.
త్వరలో యంగ్ ప్రొడ్యూసర్ సాహు నిర్మాతగా.. ప్రజంట్ బ్లాక్‌బస్టర్ విజయానందంలో ఉన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో నేనొక సినిమా చేయబోతున్నాను. ఇది మెగా అనౌన్స్‌మెంట్. అనిల్‌తో చేసే సినిమా రిలీజ్ ఎప్పుడు, ఏంటనే వివరాలను మరో లీక్‌లో చెబుతాను. ఈ సినిమా సమ్మర్‌లో ప్రారంభం అవుతుంది. సినిమా ఆద్యంతం కామెడీగా ఉంటుంది. చాలా సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయి కామెడీతో నా సినిమా ఉంటుంది.
ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్‌కి వెళతానా, ఎప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తానా? అనే ఉత్సాహంతో ఉన్నాను. అనిల్ రావిపూడి ఇంటికి వచ్చి కొన్ని సీన్స్ చెబుతుంటే పొట్ట చెక్కలయ్యేలా పగలబడి నవ్వుకుంటున్నాం. అంత బాగా కథ వస్తుంది. మా కాంబినేషన్ ఇంతకు ముందు కోదండరామిరెడ్డితో నా బంధం ఎలా అయితే ఉండేదో.. అదే ఫీల్ అనిల్ రావిపూడితో కలిగింది. సాహుతో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాత కొణిదెల సుస్మిత ఈ సినిమాను నిర్మిస్తారని చిరు ఈ వేడుకలో తెలిపారు.