దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న కూలీ సినిమా పై రోజుకో ఆసక్తికరమైన వార్త బయటకొస్తోంది. మాస్టర్ సినిమాలో లోకేష్ తో కలిసి పనిచేసిన మాళవిక మోహనన్ ఈ సినిమాలో రజనీ కూతురిగా నటించాల్సిందని కానీ ఆ ఛాన్స్ చివరకు మిస్ అయిందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఈ పాత్రకు మొదట మాళవికను అనుకున్నారు కానీ అనూహ్య కారణాలతో ఆమె స్థానాన్ని శృతి హాసన్ దక్కించుకుంది. ఇటీవల శృతి హాసన్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఓ మ్యూజిక్ వీడియోలో కనిపించడం వారిద్దరి మధ్య ఉన్న మంచి వర్కింగ్ రిలేషన్ కారణంగా ఈ అవకాశం ఆమెకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇటీవల శృతి హాసన్ కొన్ని ఆసక్తికరమైన సినిమాల్లో నుంచి తప్పుకుంటోందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న డెకాయిట్ అనే సినిమాకు తొలుత ఆమెను ఎంపిక చేసినా చివరికి మృణాల్ ఠాకూర్ ఆ పాత్రను పోషించనుంది.
గతేడాది ప్రభాస్ తో సలార్ 1లో నటించిన శృతి ఆ తర్వాత ఎలాంటి తెలుగు సినిమా సైన్ చేయలేదు. తమిళంలో కూడా ప్రస్తుతం ఆమె కూలీ ఒక్కటే చేస్తోంది. మాళవిక స్థానంలో కూలీలో శృతి హాసన్ అవకాశం పొందగా తెలుగులో శృతి ప్లేస్ లో మృణాల్ ఠాకూర్ ను తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా విజయ్ చివరి చిత్రం జన నాయగన్ లోను శృతి హాసన్ కు ఛాన్స్ వచ్చింది అంటున్నారు. మరి ఇదే నిజమైతే శృతి లక్కీ అని చెప్పాలి.
అసలే ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్స్ సంఖ్య పెరిగిపోవడంతో శృతి హాసన్ పై దర్శకులు ఎక్కువగా ఫోకస్ చేయట్లేదన్న ప్రచారం ఊపందుకుంది. అయితే ఆమె తన కెరీర్ పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే మరి.