లవ్ స్టోరీ, బంగార్రాజు సాలిడ్ హిట్స్ తర్వాత నాగ చైతన్య విక్రమ్ కుమార్ తో థాంక్యూ, హిందీలో అమీర్ ఖాన్ తో లాల్ సింగ్ చద్దా, వెంకట్ ప్రభుతో కస్టడీ చిత్రాలు చెయ్యగా అవి నాగ చైతన్యను బాగా డిజప్పాయింట్ చేసాయి. దూత వెబ్ సీరీస్ తో చైతు హిట్ అందుకున్నా అది డిజిటల్ కంటెంట్ కావడంతో సిల్వర్ స్క్రీన్ పై నాగ చైతన్య హిట్ కొట్టాల్సిన అగత్యం తలెత్తింది.
చందు మొండేటితో గత రెండేళ్లుగా తండేల్ తో ప్రయాణం చేస్తూ విపరీతంగా కష్టపడి, తండేల్ రాజాగా భాష మార్చుకుని లుక్ చేంజ్ చేసుకున్నందుకు నాగ చైతన్యకు తండేల్ తో సూపర్ హిట్ వచ్చింది. నిజంగా అభిమానుల కరువు తీరిపోయే హిట్ తండేల్ తో నాగ చైతన్య కుదురుకున్నాడనే చెప్పాలి.
వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా మార్కెట్ లో తండేల్ జోరు బాగుంది. మొదటి రోజు 21 కోట్ల గ్రాస్ కొల్లగొట్టిన తండేల్ రాజా రెండో రోజు 41 కోట్ల గ్రాస్ తేవడం చూసి అబ్బ నాగ చైతన్య కరువు తీరిపోయింది అంటూ అభిమానులే కామెంట్ చేస్తున్నారు అంటే.. నాగ చైతన్య కు తండేల్ హిట్ ఎంత రిలీఫ్ ని ఇచ్చుకుంటుంది.