తన మొదటి పెళ్లి, మాజీ భార్య సమంత, విడాకుల విషయంగా మొదటిసారి నాగ చైతన్య తండేల్ ప్రమోషన్స్ లో స్పందించడమే కాదు, తన భార్య శోభిత రియల్ హీరో అంటూ సంభోదించడం కూడా హాట్ టాపిక్ అయ్యింది. మేము(సమంత-నేను) ఎంతో అలోచించి విడాకులు తీసుకున్నాం, అది ఇద్దరి డెసిషన్, నా ఒక్కడితే కాదు, నేను చిన్నప్పుడే అలాంటి బ్రేక్ అయిన ఫ్యామిలీ నుంచి వచ్చాను. విడాకుల తర్వాత లైఫ్ నాకు తెలుసు, చాలా ఆలోచన చేశాకే విడిపోయాము. కానీ సోషల్ మీడియాలో మాత్రం అందరూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు.
తన లైఫ్(సమంత) లో తాను బీజి అయ్యింది. నేను నా లైఫ్ లో మూవ్ ఆన్ అయ్యాను కానీ చాలా నెగెటివ్ గా మట్లాడుతూ బాధపెట్టారు. నా ఫస్ట్ మ్యారేజ్ కి సంబంధించి బయటికొచ్చి చాలా ఫేస్ చేసి, ఫైట్ చేసి, మరోసారి ప్రేమలో పడడం నిజంగా హ్యాపీగా ఉంది. సోషల్ మీడియా చాట్ లో క్యాజువల్ గా కనెక్ట్ అయ్యి పరిచయం ప్రేమగా మారింది. అందులో తన తప్పేమి లేదు. తను నా లైఫ్ లోకి రావడం చాలా బ్యూటిఫుల్ గా ఉంది.
మా లైఫ్ బావుంది. కానీ తన(శోభిత) గురించి మట్లాడేటప్పుడు చాలా బాధగా ఉంది. అది చాలా తప్పు, నేను చాలా బ్యాడ్ గా ఫీలవుతున్నాను, తనకి థాంక్స్ చెప్పాలి. ఎంతో అర్ధం చేసుకుని, నా ఫాస్ట్ ని వదిలేసి, చాలా మెచ్యురిటితో ఆలోచిస్తుంది.. నిజంగా తనొక హీరో అంటూ శోభిత విషయంలో నాగ చైతన్య తండేల్ ప్రమోషన్స్ లో రియాక్ట్ అయ్యాడు.