కిర్రాక్ ఆర్పీ రోజా విషయంలో చాలా సీరియస్ గా ఉంటున్నాడు. ప్రస్తుతం సినిమాలు, టివి షోస్ అన్ని పక్కన పెట్టి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బిజినెస్ తో పాటుగా రాజకీయాల్లో యాక్టీవ్ అయిన ఆర్పీ వైసీపీ అధికార ప్రతినిధి రోజా పై ఎప్పటికప్పుడు ఫైర్ అవుతూ వార్తల్లో నిలుస్తున్నాడు. తిరుపతి లడ్డు విషయంలో రోజాపై సంచనల కామెంట్స్ చేసిన ఆర్పీ మరోసారి రోజా పై రెచ్చిపోయి వ్యాఖ్యలు చేసాడు.
రీసెంట్ గా రోజా కుంభమేళాలో పాల్గొన్న రోజే అక్కడ తొక్కిసలాట జరిగిన విషయాన్ని ఆర్పీ ప్రస్తావిస్తూ.. కుంభమేళా స్నానంలో ఎవరైనా నిండుగా మునిగితే రోజా మాత్రం సగమే మునిగి ముఖాన్ని పైకే వదిలేసింది, ఆ మాత్రం దానికి అక్కడ వరకు వెళ్ళి మునగడం ఎందుకు అంటూ సెటైర్స్ వేసాడు. అంతేకాదు రోజా జైలు కి వెళుతుంది అంటూ ఆర్పీ సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు.
వితిన్ మూడు నెలల్లో రోజా నువ్వు ఊచలు లెక్కపెట్టబోతున్నావు రెడీగా ఉండు అంటూ ఆర్పీ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. గతంలో రోజా సిద్దార్థ్ రెడ్డి వందల కోట్ల అవినీతి చేసారంటూ మాట్లాడిన ఆర్పీ ఇప్పుడు రోజా జైలుకెళుతుంది అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.