పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు చూసి జనసైనికులు కంగారు పడుతున్నారు. జనసేన పార్టీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ అవడమే కాదు జనసేనలో ముఖ్యమైన వాళ్లకు మంత్రి పదవులు ఇప్పించారు. మరోపక్క జనసేన ఏపీ లో స్ట్రాంగ్ అవుతున్న తరుణంలో జనసేనపై ఆరోపణలు ఎక్కువవుతున్నాయి.
మొన్నటికి మొన్న జనసేనలో కీలకంగా ఉన్న జానీ మాస్టర్ పై లేడీ కొరియోగ్రాఫర్ వేధింపుల కేసు పెట్టడం, ప్రస్తుతం అతనిని జనసేన పక్కన పెట్టడం, ఇంకా ఆ కేసు కోర్టులోనే ఉన్న సమయంలోనే ఇప్పడు మరో వివాదం జనసేన ను సమస్యల్లో పడేసాలా ఉంది. జనసేన నేత కిరణ్ రాయల్ ఓ అమ్మాయిని వేధించాడంటూ ఆ అమ్మాయి వీడియో రిలీజ్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
కిరణ్ రాయల్ వేధింపుల కారణంగా ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటాను అంటూ బెదిరితీస్తూ ఓ వీడియో రిలీజ్ చెయ్యడం వైసీపీ కి అస్త్రంగా మారింది. తిరుపతి జనసేన ప్రతినిధి కిరణ్ రాయల్ తనని వేధించాడంటూ మహిళ పేర్కోవడం, అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మాటమే కాదు వైసీపీ వాళ్ళు దానినితో రచ్చ మొదలు పెట్టారు.
మరి ఇలాంటివన్ని జనసేన పార్టీకి డ్యామేజ్ కలిగించే అంశాలే. ఒకవేళ కిరణ్ రాయల్ తప్పు చేస్తే పవన్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, లేదంటే పార్టీకి ప్రమాదం అంటూ కొందరు సలహాలు ఇస్తుంటే పవన్ కలుస్తా చూసుకోండి అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.