Advertisement
Google Ads BL

అఖండ 2.. బాలయ్య‌ను ఢీ కొట్టేదెవరంటే..


బ్లాక్‌బస్టర్ అఖండకు సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటున్న అఖండ 2: తాండవం మూవీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా.. సినిమాపై పిచ్చ క్రేజ్‌ని పెంచుతున్నాయి. బాలయ్య, బోయపాటి కాంబో అంటేనే అభిమానులకు పండగ. అలాంటిది బ్లాక్‌బస్టర్‌కు సీక్వెల్ అంటే.. బోయపాటి ఇంకెంతగా వర్క్ చేసి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. అందుకే అభిమానులు కూడా ఈ సినిమాపై ధీమాగా ఉన్నారు.

Advertisement
CJ Advs

అలా అని బోయపాటి కూడా ఏం కామ్‌గా ఉండటం లేదు.. ఈ మధ్యకాలంలో ఏ సినిమాకు లేని విధంగా.. వరుస అప్డేట్‌లతో ఫ్యాన్స్‌ని స్కైలో విహరింపజేస్తున్నాడు. ఇటీవల కుంభమేళాలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ 7 ఏకర్స్‌లో షూటింగ్ జరుపుకుంటున్నట్లుగా తెలుపుతూ.. ఈ సినిమాలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ ఎవరో కూడా రివీల్ చేశారు.

అఖండ 2లో బాలయ్యని ఢీ కొట్టే విలన్ ఎవరంటే.. ఇంతకు ముందు బోయపాటి, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన సరైనోడు సినిమాలో విలన్‌గా నటించిన ఆది పినిశెట్టి. ఇందులో ఆది పాత్రను బోయపాటి ఫెరోషియస్‌గా రూపొందించారని, ఇది తన కెరీర్‌లో మోస్ట్ ఇంపాక్ట్ పాత్రలలో ఒకటిగా నిలుస్తుందని.. ముఖ్యంగా బాలయ్య, ఆదిల మధ్య జరిగే ఇంటెన్స్ యాక్షన్.. థ్రిల్లింగ్ విజువల్ ఫీస్ట్ ఇస్తుందని మేకర్స్ ఈ అప్డేట్‌లో పేర్కొన్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఎం తేజస్విని నందమూరి సమర్పకురాలు. దసరా కానుకగా 25 సెప్టెంబర్, 2025న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలోకి రానుంది.

Akhanda 2: Thandavam Latest Updates:

Aadi Pinisetty Revealed as Villain to Challenge Balakrishna
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs