విక్టరీ వెంకటేష్ ఈ సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాంతో నిజంగానే విక్టరీ కొట్టి చూపించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి నటించిన వెంకీకి సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కెరీర్‌లో అపురూపంగా గుర్తుండిపోయేలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. రూ.300 కోట్లు కలెక్షన్స్ దాటించిన ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా అట్రాక్ట్ అయ్యారు.
జనవరి 14 సంక్రాంతి స్పెషల్‌గా రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో.. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ చూపు ఓటీటీ డేట్ పై పడింది. ఇప్పటికే సంక్రాంతికి విడుదలైన గేమ్ చేంజర్ ఫిబ్రవరి 7 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కి వచ్చేసింది.
ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ రైట్స్ ఫ్యాన్సీ డీల్‌తో దక్కించుకున్న ZEE5 ఈ చిత్రాన్ని నెక్స్ట్ వీక్ లో స్ట్రీమింగ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. అయితే డేట్ లాక్ చెయ్యకుండా నెక్స్ట్ వీకంటూ ZEE5 వారు ఓటీటీ ఆడియన్స్‌ని ఊరించేశారు. మరి నెక్స్ట్ వీక్ అంటే వచ్చే శుక్రవారమే సంక్రాంతికి వస్తున్నాం స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.