Advertisement
Google Ads BL

వర్మే వస్తానని చెప్పాడట.. పెద్ద మ్యాటరే!


ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ల ఫొటోలను మార్ఫింగ్ చేసి ట్విట్టర్ ఎక్స్‌లో రచ్చ చేసిన రామ్ గోపాల్ వర్మపై ఒంగోలు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసు కోర్టుకు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక సాకుతో వర్మ తప్పించుకుని తిరుగుతున్నాడు. కానీ ఈసారి స్వయంగా ఆయనే ఫోన్ చేసి విచారణకు వస్తానని చెప్పాడట. అది మ్యాటర్. 

Advertisement
CJ Advs

అంతే.. ఏంటి? వర్మే స్వయంగా విచారణకు వస్తానని చెప్పాడంటే ఏదో పెద్ద మ్యాటరే ఉంది అనేలా నెటిజన్లు ఒకటే కామెంట్స్. ఆ మ్యాటర్ ఏంటంటే.. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా రాని వర్మపై ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ సీరియస్ అయ్యిందని, ఈసారి కచ్చితంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అందుకే, చేసేది లేక వర్మ శుక్రవారం కోర్టు విచారణకు హాజరవుతానని తెలిపినట్లుగా విచారణాధికారి సీఐ శ్రీకాంత్ వర్మ తెలిపారు.

అయితే, ఇది కాదు అసలు మ్యాటర్. ఆయన వస్తానని చెప్పాడు కానీ వస్తాడా? అనేదే మ్యాటర్. ఎందుకంటే, ఈ మధ్య కాలంలో వర్మ.. మాట మీద నిలబడినట్టుగా హిస్టరీలోనే లేదు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అన్నట్లుగా వర్మ తీరు ఉంది. అలాంటి వర్మ.. విచారణకు హాజరవుతానని చెబితే నమ్మడం కష్టమే అంటున్నారు. చివరి నిమిషంలో ఏదైనా జరగవచ్చు.. ఎలా అయినా వర్మ మాట మార్చేస్తాడు.. అంటూ నెటిజన్లు కొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

Ram Gopal Varma Promises to Attend Investigation – A Big Twist in the Case!:

Will Ram Gopal Varma Keep His Word to Appear in Court?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs