బాలీవుడ్‌లో జాన్వీ కపూర్ ప్రస్తుతం పరమ్ సుందరి, సన్నీ సంస్కారీకి తులసీ కుమారి అనే చిత్రాల్లో నటిస్తోంది. అంతేకాకుండా తెలుగులో రామ్ చరణ్ 16వ సినిమాలోనూ ప్రధాన పాత్రలో కనిపించనుంది. అయితే ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన సన్నీ సంస్కారీకి తులసీ కుమారి చిత్రం మరోసారి వాయిదా పడింది. షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తికాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంకా 25 రోజులు చిత్రీకరణ మిగిలి ఉండటంతో ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుంది ? ఎప్పుడు విడుదల అవుతుంది ? అనే విషయంలో స్పష్టత రాలేదు.
ఈ సినిమా వాయిదా కారణంగా జాన్వీ షెడ్యూల్‌లో మార్పులు రావడంతో ఇతర ప్రాజెక్టులపై ప్రభావం పడింది. ముఖ్యంగా రామ్ చరణ్ సినిమాకు కేటాయించిన డేట్స్‌తో ఈ కొత్త షెడ్యూల్ క్లాష్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం జాన్వీ మరో 25 రోజుల షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. అందులో 15 రోజులు నిరంతరంగా షూటింగ్‌కి హాజరుకావాల్సిన అవసరం ఉంది. అయితే రామ్ చరణ్ సినిమా కోసం ఫిక్స్ చేసిన షెడ్యూల్‌లోనూ ఇవే తేదీలు వచ్చిపడటంతో ఆమెకు ఏం చేయాలో అర్థం కావట్లేదట.
ఒకేసారి ముంబై, హైదరాబాద్‌ల మధ్య ప్రయాణించడం చాలా కష్టమైన పని. ప్రస్తుతం పరమ్ సుందరి, సన్నీ సంస్కారీకి తులసీ కుమారి చిత్రాల షూటింగ్‌ను జాన్వీ బ్యాలెన్స్ చేస్తూ వస్తోంది. కానీ రామ్ చరణ్ సినిమా పూర్తిగా హైదరాబాద్‌లోనే తెరకెక్కుతుండటంతో ఈసారి అదే అవకాశం కనిపించడం లేదు.
ఈ పరిస్థితుల్లో డేట్స్ క్లాష్ కాకుండా జాగ్రత్త పడటానికి హిందీ సినిమా మేకర్స్‌నే సర్దుబాటు చేయాలని భావిస్తున్నారు. ఎందుకంటే రామ్ చరణ్ సినిమా కోసం జాన్వీ ఇప్పటికే తన తేదీలను ఫిక్స్ చేసింది. బాలీవుడ్ ప్రాజెక్ట్ షూటింగ్ ఆలస్యం కావడం వల్ల ఇప్పుడు వారే వెనక్కి తగ్గాలని భావిస్తున్నారు. మరి ఈ డేట్ల సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందేమో చూడాలి.