విజయ్ దేవరకొండ-పూరి జగన్నాధ్ ల పాన్ ఇండియా ఫిలిం లైగర్ మూవీ ఎంత పెద్ద డిజాస్టరో అందరికి తెలుసు. లైగర్ చిత్రం డిజాస్టర్ అవడం ఓ ఎత్తు, ఆ చిత్రం వలన పూరి జగన్నాధ్, ఛార్మీలు సఫర్ అవడమే కాదు.. విజయ్ దేవరకొండ పై ప్రేక్షకుల్లో ఇప్పటికి డౌట్ అలానే ఉంది. ఇక అనన్య పాండే అయితే చెప్పక్కర్లేదు. మా నాన్న చెబితే చేశాను అంది.
తాజాగా అనన్య పాండే తండ్రి చుంకి పాండే లైగర్ లో తన కూతురు అనన్య ఇబ్బందిగా పనిచేసింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు. ఆ ప్రాజెక్ట్ లో నటించడం ఆమెకు ఏమాత్రం ఇష్టం లేదు, నేను చెప్పటం వలనే నటించింది అన్నారు. లైగర్ ఛాన్స్ వచ్చినప్పుడు అనన్య చాలా అసౌకర్యంగా ఫీలైంది. కానీ అది పాన్ ఇండియా ఫిలిం చేస్తే మంచి పేరొస్తుంది అని నేను చెప్పడం వలనే అనన్య ఆ సినిమా చేసింది.
లైగర్ కథకు అనన్య సూట్ అవ్వలేదు. కథ విన్నప్పుడు అనన్య చాలా గందరగోళానికి గురయ్యింది. స్క్రీన్ పై మరీ చిన్న పిల్లలా కనిపిస్తానని అనుమానపడింది. కానీ నేనే నచ్చజెప్పాను. సినిమా రిలీజ్ అయ్యి నెగెటివ్ రివ్యూస్ వచ్చాక నా నిర్ణయం తప్పని తెలిసింది అంటూ లైగర్ రిజల్ట్ పై చంకి పాండే స్పందించారు.