రీసెంట్ గా రాజ్ తరుణ్ మాజీ లవర్ లావణ్య బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషా పై కేసు పెట్టింది. లావణ్య ను డ్రగ్స్ కేసులో ఇరికించే ప్రయత్నం చేసాడు అంటూ శేఖర్ బాషా పై ఆమె కేసు పెట్టింది. ఇప్పుడు RJ శేఖర్ బాషా పై నార్సింగి పీస్ లో మరో కేసు నమోదు అయ్యింది.
శేఖర్ బాషా పై కొరియోగ్రాఫర్ షష్టి వర్మ ఫిర్యాదు చేసింది. గతంలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేసిన షష్టి వర్మ.. జానీ మాస్టర్ కేసులో విచారణ జరుగుతుండగా తన వ్యక్తి గత కాల్ రికార్డు శేఖర్ బాషా లీక్ చేశాడని షష్టి వర్మ ఫిర్యాదు, తన పరువుకు భంగం వాటిల్లేలా , కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ లో శేఖర్ బాషా మాట్లాడుతున్నాడని షష్టి వర్మ ఫిర్యాదు చేసింది.
శేఖర్ బాషా ఉద్దేశ పూర్వకంగా మరియు దురుద్దేశంతో ప్రయివేటు కాల్ రికార్డ్ లు లీక్ చేశాడని FIR లో పేర్కొన్న పోలీసులు, శేఖర్ బాషా వ్యక్తిగత మొబైల్ తోపాటు, అతనితో ఉన్న ఇతర ఎలక్ట్రానిక్ డివైజస్ లు సీజ్ చేయాలని షష్టి వర్మ పోలైలాను కోరింది. దానితో పోలీసులు BNS యాక్ట్ సెక్షన్ 79 ,67, ఐటీ యాక్ట్ 72 కింద శేఖర్ బాషా పై కేసు నమోదు చేసారు.