ఏప్రిల్ నుంచి రాజా సాబ్ పోస్ట్ పోన్ అవుతుంది అంటూ ప్రచారం జరగడమే కానీ ఆ విషయాన్ని మేకర్స్ ఇప్పటివరకు కన్ ఫర్మ్ చెయ్యలేదు. ప్రభాస్ రాజా సాబ్ షూటింగ్ కి బ్రేకిచ్చారు, కాలు బెణికింది అందుకే రాజా సాబ్ అనుకున్న తేదికి రాకపోవచ్చనే ఊహాగానాలు నిజమయ్యేలా ఉన్నాయి. అంతేకాదు సంక్రాంతికి టీజర్ కూడా వదల్లేదు.
అనుష్క ఘాటీ ఏప్రిల్ లో రాజా సాబ్ తేదికి ఓ వారం తర్వాత విడుదలకు రిలీజ్ డేట్ ప్రకటించారు. మరోపక్క సిద్దు జొన్నలగడ్డ జాక్ కూడా ఏప్రిల్ 10 కె విడుదల అని ప్రకటించారు. ఇవన్నీ చూస్తుంటే రాజా సాబ్ వాయిదా పడక ఇంకేమవుతుంది. ఈ ఊహాగానాల నడుమ దర్శకుడు మారుతి రాజా సాబ్ ను దసరా కు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. కొద్దిరోజుల్లో దీనిపై అఫీషియల్ ప్రకటన రానున్నట్లుగా సమాచారం.
ప్రస్తుతం రాజా సాబ్ షూటింగ్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడిగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్దీ కుమార్ లు నటిస్తున్నారు.