గత ఆరు నెలలుగా జగన్ మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామో తెలియకుండా.. ప్రజలు చంద్రబాబు సూపర్ 6 పథకాలకు ఆశపడ్డారు, వాళ్ళు అది అమలు చేయలేరు అని తెలిసినా ప్రజలు వాళ్ళకే ఓట్లేశారు. అమలు కానీ హామీలు నేను ఇవ్వను అంటూ మొత్తుకుంటున్నాడు తప్ప.. అసలు ఓటమికి గల కారణాలు వెతకడం లేదు అనేది బ్లూ మీడియా నెత్తి నోరు కొట్టుకుని దండోరా వేస్తుంది.
వైసీపీ కార్యకర్తలను జగన్ విస్మరించాడు, వాలంటీర్లను నమ్మి వైసీపీ కార్యకర్తలను జగన్ పట్టించుకోలేదు, జగన్ కోటరిగా ఉన్న నాలుగు స్తంభాలు జగన్ ఓటమికి కారణమయ్యారు.. అంటూ చెబుతున్నా జగన్ ఇప్పటికి తన కోటరీనే నమ్ముతున్నాడు, కార్యకర్తలను పట్టించుకోవడం లేదు. ఈ ఆరు నెలలుగా ప్రజా సమస్యలను పట్టించుకోకుండా వైసీపీ నేతలు జైలుకెళితే పరామర్శించడానికి జైలుకు వెళ్లిన జగన్ ఇప్పుడేం చేస్తారు.
ఈమధ్యనే లండన్ నుంచి తిరిగొచ్చిన జగన్ ఇకపై ఎలాంటి వ్యూహాలు చేస్తారు. చంద్రబాబు సూపర్ 6 పథకాలు అమలు చెయ్యకపోతే పోరాటం చేస్తాను అంటూ జగన్ ప్రకటించారు. అది ఈ నెల నుంచే మొదలు పెట్టబోతున్నారు. మరి జగన్ పోరాటానికి జగన్ మోహన్ రెడ్డి ని హైలెట్ చేసేందుకు బ్లూ మీడియా తంటాలు పడుతుంటే జగన్ మాత్రం ఇకపై 2.ఓ ని వేరే లెవల్లో చూస్తారంటూ మాట్లాడుతున్నారు.
దానితో ఈ ఆరు నెలలుగా లేనిది ఇప్పుడు 2.ఓ ని చూపిస్తారా.. అంటూ కామెడీగా కామెంట్స్ పెడుతున్నారు.