ఈమధ్యన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పెద్దగా కనిపించడం లేదు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ఎన్నికల ప్రచారం చేసినా, పవన్ వెళ్ళలేదు, మరోపక్క జనసేన సభల్లో నాగబాబు కనిపిస్తున్నారు కానీ, పవన్ కనిపించడం లేదు. సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నారా అది కూడా ఎలాంటి అప్ డేట్ లేదు. ఇటు అధికారికంగాను పవన్ హడావిడి కనిపించడం లేదు.
రీసెంట్ గా సింగపూర్ వెళ్లొచ్చిన పవన్ కళ్యాణ్ ఈరోజు బుధవారం కేరళ పర్యటనకు వెళ్ళబోతున్నారు. అది కూడా అధికారికంగా కాదు, పూర్తి వ్యక్తిగతం అని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం సహా అక్కడ పలు ఆలయాలను సందర్శిస్తారు అని సమాచారం.
పవన్ కళ్యాణ్ కేరళ పర్యటన ముగియగానే అటునుంచి అటే మూడు రోజుల పాటు తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను కూడా సందర్శిస్తారన్న వార్తాలు వైరల్ అవుతున్నాయి కానీ.. జనసేన నుంచి ఎలాంటి ప్రకటన లేదు. మరి ఇదంతా పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా చేస్తున్నారని అంటున్నారు. చూద్దాం పవన్ కేరళ వెళ్ళాక ఏమైనా ప్రకటన వస్తుందేమో అనేది.