నందమూరి బాలకృష్ణ కు జూనియర్ ఎన్టీఆర్ కు మధ్యలో ఎంత అగాదం ఉందొ చాలా సందర్భాలలో స్పష్టమవుతూనే ఉంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఎన్టీఆర్ ను దగ్గరకు తీసినా చాలా ఎక్కువ సమయాన్ని బాలయ్య ఎన్టీఆర్ తో దూరాన్ని మైంటైన్ చేసారు. వారి మద్య ఉన్న దూరం మీడియా దృష్టిని దాటి పోవడం లేదు. ఎవరెన్ని అన్నా బాలయ్య పట్టించుకోరు.
తాజాగా పద్మభూషణ్ బాలకృష్ణ కు ఆయన చెల్లి నారా భవనేశ్వరి గ్రాండ్ పార్టీ అరేంజ్ చేసారు. ఈ వేడుకలో నారా లోకేష్ బాలయ్య గురించి మట్లాడారు. తన కన్నా మరో అల్లుడు భరత్ అంటే మావయ్యకు చాల ఇష్టమని చెప్పిన లోకేష్ బాలా మావయ్య చాలా ఎమోషనల్ అన్నారు.
ఎవరినైనా ప్రేమిస్తే ఎంత ఎక్కువ ప్రేమిస్తారో, దూరం పెడితే అంతే దూరంగా ఉంటారు అంటూ లోకేష్ మాట్లాడం చూసి చాలామంది చాలా రాకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఎన్టీఆర్ విషయంలో బాలయ్య ఎలా ఉంటున్నారో లోకేష్ ఇలా చెప్పకనే చెప్పేసాడు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.