గత ఏడాది లావణ్య-రాజ్ తరుణ్ కేసులో యూట్యూబ్ ఇంటర్వూస్ తో ఒక్కసారిగా ఫేమస్ అయిన శేఖర్ బాషా రాజ్ తరుణ్ ని వెనకేసుకొస్తూ లావణ్య ను దుర్భాషలాడాడు, లావణ్య ఓ ఛానల్ లైవ్ లో శేఖర్ బాషా పై చెప్పు తో దాడి చేసిన ఘటన అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. ఆతర్వాత శేఖర్ బాషా బిగ్ బాస్ కి వెళ్లి రెండు వారాల్లోనే ఎలిమినేట్ అయ్యాడు.
తాజాగా మరోసారి లావణ్య కేసు విషయం కదులుతుంది. లావణ్య-రాజ్ తరుణ్ ప్రవేట్ వీడియోస్ తో బ్లాక్ మెయిల్ చేసిన మస్తాన్ భాష ను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఇప్పుడు లావణ్య ను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు శేఖర్ బాషా ప్లాన్ చేసాడంటూ అతన్ని అరెస్ట్ చేసేందుకు పోలీస్ లు సిద్ధమవుతున్నారనే న్యూస్ వైరల్ అయ్యింది.
లావణ్య-రాజ్ తరుణ్ వ్యవహారంలో శేఖర్ బాషా లావణ్య ను ఇరికించడానికి నానా తంటాలు పడడమే కాదు, ఆమెను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు ప్లాన్ చెయ్యగా అందులో శేఖర్ బాషా కీలకంగా వ్యవహరించాడని కంప్లైంట్ అందడంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేసేందుకు రంగం చేస్తున్నారని తెలుస్తోంది.