కీర్తి సురేష్ బాలీవుడ్ కు వెళ్ళకముందే ట్రెడిషనల్ వేర్ నుంచి బయటికి వచ్చి మోడ్రెన్ లుక్ లోకి మారిపోయింది. ఒకప్పుడు సాంప్రదాయానికి కేరాఫ్ గా కీర్తి సురేష్ కనిపించేది. ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టుగా మారిపోయింది. బేబీ జాన్ చిత్రంలోని ఓ సాంగ్ లోనే కాదు బేబీ జాన్ ప్రమోషన్స్ లోను కీర్తి సురేష్ అందాలు తెగ హైలెట్ అయ్యాయి.
పెళ్లి తర్వాత రీసెంట్ గా హనీమూన్ కి వెళ్లోచ్చిన కీర్తి సురేష్ మళ్లీ ముంబై ఫ్లైట్ ఎక్కింది. అక్కడ నెట్ ఫ్లిక్స్ ఓటీటీ కోసం చేసిన అక్క ప్రమోషన్స్ కి రెడీ అయ్యింది. మరి బాలీవుడ్ ప్రమోషన్స్ అంటే కీర్తి సురేష్ గ్లామర్ ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిందే. తాజాగా చీరకట్టులో కీర్తి సురేష్ మరోసారి మతిపోగొట్టేసింది.
క్రీమ్ కలర్ శారీ లో స్లీవ్ లెస్ బ్లౌజ్ తో కీర్తి సురేష్ ఫోటోలకు ఫోజులివ్వగా ఇప్పుడా గ్లామర్ లుక్ వైరల్ అయ్యింది. మీరు కూడా కీర్తి సురేష్ కొత్త పిక్ పై ఓ లుక్కెయ్యండి.