గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ కలిసి దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన గేమ్ చేంజర్ చిత్రం సంక్రాంతి స్పెషల్ గా జనవరి 10 న రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టిన గేమ్ చేంజర్ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో తడబడింది.
సోషల్ మీడియాలో నెగిటివిటి, గేమ్ ఛేంజెర్ టాక్, పైరసీ అన్ని సినిమాని కి కిల్ చేసేశాయి. ఇక థియేటర్స్ లో నిరాశపరిచిన ఈ చిత్రాన్ని రిలీజ్ కు ముందే ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ డీల్ తో గేమ్ చేంజర్ డిజిటల్ హక్కులను దక్కించుకుంది. కొద్దిరోజులుగా గేమ్ చేంజర్ ఓటీటీ తేదీపై రకరకాల న్యూస్ లు వినిపించాయి.
తాజాగా అమెజాన్ ప్రైమ్ వారు గేమ్ చేంజర్ ఓటీటీ డేట్ లాక్ చేసింది. ఈ నెల 7 న అంటే వచ్చే శుక్రవారం నుంచి రామ్ చరణ్ గేమ్ చెంజర్ స్ట్రీమింగ్ చెయ్యబోతున్నట్టుగా అఫీషియల్ పోస్టర్ తో ప్రకటిచారు. మరి థియేటర్స్ లో చూడని ఆడియన్స్ ఓటీటీలో గేమ్ చెంజర్ వీక్షించేందుకు రెడీ అవ్వాల్సిందే.