పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్ విషయంలో ఏం జరుగుతుంది. హరి హర వీరమల్లు రిలీజ్ పై రకరకాల న్యూస్ లు వినిపిస్తున్నాయి. అసలు సినిమా మార్చి 28 న రాకపోవచ్చని అంటున్నారు. మేకర్స్ మాత్రం పదే పదే వీరమల్లు మార్చి 28 అంటూ పోస్టర్స్ లో ప్రకటిస్తున్నారు. వీరమల్లు వస్తే నితిన్ లాంటి హీరోలు మార్చ్ 28 కి రారు.
మరోపక్క పవన్ కళ్యాణ్ OG షూటింగ్ లోకి వెళ్ళలేదు. ఈమధ్యనే పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలను దర్శకుడు సుజిత్ బ్యాంకాక్ లో తెరకెక్కించారు. ఆ తర్వాత మళ్లీ చప్పుడు లేదు. వీరమల్లు కన్నా ముందే OG రిలీజ్ ఉంటుంది అంటూ ప్రచారం జరిగింది. కారణం OG షూట్ చాలా తక్కువ బ్యాలెన్స్ ఉంది కాబట్టి.
కానీ వీరమల్లు విషయంలో క్లారిటీ లేదు, ఇలాంటి సమయంలో OG మేకర్స్ రిలీజ్ డేట్ ఎలా ఇస్తారంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో గుసగుసలు మొదలయ్యాయి. అది చూసి పవన్ అభిమానుల్లో కంగారు మొదలైంది. బ్రో వచ్చాక వీరమల్లు, లేదంటే OG కోసం వారు రెండేళ్లుగా తెగ వెయిట్ చేస్తున్నారు. అలాంటి సమయంలో ఇలాంటి వార్తలు వాళ్ళను ఆందోళన పడేలా చేస్తున్నాయి.