ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా గ్లామర్ ఫోటో షూట్స్ తో హంగామా చేసే రకుల్ ఇప్పుడు వారానికో, లేదంటే రోజుకో ఫోటో షూట్ కాదు.. ఒకేరోజు రెండు ఫొటో షూట్స్ ని వేర్వేరు లుక్స్ లో షేర్ చేస్తూ రకుల్ ప్రీత్ అద్దరగొట్టేస్తుంది. కారణం రకుల్ హిందీలో నటించిన మేరే హస్బెండ్ కి బీవీ చిత్రం విడుదలకు రెడీ అవుతుంది.
అర్జున్ కపూర్-రకుల్ ప్రీత్-భూమి పెడ్నేకర్ కలయికలో తెరకెక్కిన ఈచిత్ర ప్రమోషన్స్ లో రకుల్ ప్రీత్ గ్లామర్ గా కనిపిస్తుంది. వరస ప్రమోషన్స్ లో సందడి చేస్తుంది. చాలా రోజుల తర్వాత రకుల్ నుంచి రాబోతున్న మేరే హస్బెండ్ కి బీవీ చిత్రంపైనే రకుల్ ఆశలు పెట్టుకుంది. హిందీలో ఇప్పటివరకు రకుల్ ప్రీత్ కి సక్సెస్ దక్కలేదు.
మేరే హస్బెండ్ కి బీవీ చిత్రంతో హిట్ కొట్టాలని రకుల్ ఈ చిత్రాన్ని గ్లామర్ గా తెగ ప్రమోట్ చేస్తుంది. అందులో భాగంగానే ఆమె ప్రమోషన్స్ కి వెళ్ళేముందు స్పెషల్ ఫోటో షూట్స్ చేయించుకుని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా గోల్డ్ కలర్ డిజైనర్ వేర్ లో రకుల్ మెరిసిపోయింది.