Advertisement
Google Ads BL

మంచు వివాదానికి ముగింపు లేదు


గత ఏడాది మంచు వారి ఆస్తి తగాదా మీడియాలో ఎంత హైలెట్ అయ్యిందో, ఈ వివాదంలో సహనం కోల్పోయిన మోహన్ బాబు జర్నలిస్ట్ పై చేయి చేసుకోవడం, ఆతర్వాత మనోజ్ పై మోహన్ బాబు కేసు పెట్టడం, మనోజ్ విష్ణు పై కేసు పెట్టడం ఇవన్నీ ఎంతగా హాట్ టాపిక్ అయ్యాయో చూసారు. మోహన్ బాబు విద్యా సంస్థల్లో ఫ్రాడ్ జరుగుతుంది, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపను అని మనోజ్ ఛాలెంజ్ చెయ్యడం, 

Advertisement
CJ Advs

నా ఆస్తులతో మనోజ్ కి సంబంధం లేదు అని మోహన్ బాబు ఇలా వాదోపవాదనలు నడుమ, ఇరువురు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. 

తాజాగా మోహన్ బాబు, మనోజ్ ఈరోజు ఈ కేసు విషయంపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ని కలిశారు. మంచు మనోజ్ ఆక్రమించుకున్న తన ఇంటిని అప్పగించాలని, మనోజ్ అనుభవిస్తున్న ఆస్తులన్నీ తన కష్టార్జితమని, తన స్వార్జితమైన ఆస్తులను మనోజ్ తనకు అప్పగించాలి అంటూ మోహను బాబు  కలెక్టర్ కి ఫిర్యాదు చేసారు. 

మోహన్ బాబు ఫిర్యాదుతో రెవిన్యూ అధికారులు గతంలోనూ మనోజ్ కి నోటీసు లు పంపించారు. దానితో మనోజ్ జనవరి 19 న కలెక్టర్ ఎదుట విచారణకు హాజరయ్యాడు. తాజాగా మరోసారి మోహన్ బాబు, మనోజ్ మరోసారి ఈకేసులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎదుట హాజరయ్యారు. 

The Manchu controversy is not over:

Mohan Babu and Manchu Manoj Visit Ranga Reddy District Collectorate
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs