గత ఏడాది రాజ్ తరుణ్ - లావణ్య వ్యవహారం మీడియాలో ఎంతగా హాట్ టాపిక్ అయ్యిందో అందరూ చూసారు. రాజ్ తరుణ్ తనని వదిలేసి మాల్వి మల్హోత్రాతో కలిసి ఉంటూ తనకి అన్యాయం చేస్తున్నాడంటూ లావణ్య రోడ్డెక్కి పోలీస్ కేసు పెట్టింది. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రాలు తనను వేధిస్తున్నారంటూ కేసు పెట్టిన లావణ్య ఈ కేసులో మస్తాన్ సాయి కి కూడా ప్రమేయం ఉంది అంటూ నార్సింగ్ స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ కేసు రకరకాల మలుపులు తిరిగింది. కొన్నాళ్లుగా ఈ కేసు విషయంలో సైలెంట్ గా ఉన్న నార్సింగ్ పోలీసులు లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మస్తాన్ సాయిని అరెస్ట్ చేసారు. పలువురు అమ్మాయిలతో ప్రైవేట్ గా ఉన్న సమయంలో వీడియోలు రికార్డ్ చేసినట్లు మస్తాన్ సాయిపై ఆరోపణలు. ప్రైవేట్‌గా గడిపిన వీడియోలతో మస్తాన్ సాయి బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నట్లు పోలీసుల గుర్తింపు.
లావణ్యకు చెందిన కొన్ని వీడియోలను రికార్డ్ చేసిన మస్తాన్ సాయి. వీడియోలను పోలీసులకు అందజేసి మస్తాన్ సాయిపై లావణ్య కేసు పెట్టింది. ఈరోజు కోకాపేట మస్తాన్ సాయి ని వద్ద అరెస్ట్ చేసిన నర్సింగ్ పోలీసులు. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో 200 వీడియోలకుపైగా ఉన్నట్లు గుర్తింపు.