నాగ చైతన్య-సాయి పల్లవి కాంబోలో చందు మొండేటి తెరకెక్కించిన తండేల్ చిత్రం పై ఇప్పుడున్న హైప్ ని మరింతగా పెంచేందుకు నిర్మాత అల్లు అరవింద్ పుష్ప 2 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కొడుకు అల్లు అర్జున్ ని తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వస్తున్నారంటూ అనౌన్స్ చేసారు. అయితే ఈ ఈవెంట్ కి మీడియా కానీ, ఆడియన్స్ కి కానీ అనుమతి లేదు. క్లోజెడ్ ఈవెంట్ గా తండేల్ ఈవెంట్ ఉండబోతుంది అంటూ అల్లు అర్జున్ విషయంలో తెగ హడావుడి చేసారు.
కట్ చేస్తే అల్లు అర్జున్ తండేల్ ఈవెంట్ కి రాలేకపోవడంతో రకరకాల అనుమానాలు మొదలవుతాయని అల్లు అరవింద్ తండేల్ ఈవెంట్ స్టేజ్ పై కారణం చెప్పారు. అల్లు అర్జున్ అప్పుడే విదేశాల నుంచి వచ్చాడు. చాలా సివియర్‌గా గ్యాస్ట్రిటిస్ పెయిన్ రావడంతో ఈ ఈవెంట్ కి బన్నీ రాలేకపోయాడు. మీ అందరికీ ఈ విషయం చెప్పమన్నాడు. దయచేసి ఎవరూ అపార్థం చేసుకోకండి అని చెప్పారు.
కానీ కొంతమంది తండేల్ పై నెగిటివిటి స్టార్ట్ చేసారు. అల్లు అర్జున్ ఈ ఈవెంట్ కి రాకపోవడానికి ఆయన సినిమా చూసారు, అల్లు అర్జున్ కి సినిమా నచ్చలేదు, ఒకవేళ పబ్లిక్ ఈవెంట్ కి వచ్చి తండేల్ ని సపోర్ట్ చేస్తే తన జెడ్జ్మెంట్ పై లేనిపోని అనుమానాలొస్తాయని అల్లు అర్జున్ ఈ ఈవెంట్ ని స్కిప్ చేసాడు.
అంతేకాదు అల్లు అర్జున్ ఈవెంట్ కి రాపోవడానికి ఆయన కాలు బెణికింది. అందుకే రాలేకపోయాడు, ఈ విషయం అత్యంత విశ్వసనీయ సమాచారం అంటూ చెబుతున్నారు. మరి ఇలాంటి వార్తలన్నీ తండేల్ పై నెగెటివ్ ప్రభావం చూపిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.