కొన్నాళ్లుగా అందాలు చూపించే పనిలో బిజీగా ఉన్న సమంత.. ఆమె సోషల్ మీడియా ఖాత తెరవగానే గ్లామర్ ఫోటో షూట్స్ మాత్రమే దర్శనమిచ్చేవి. ఎవరి మీద కోపమో తెలియదు, అవకాశాల కోసమో తెలియదు, హిందీలో బిజీ అయ్యే ప్రయత్నమో తెలియదు.. కానీ సమంత గ్లామర్ మాత్రం టూమచ్ గా తయారైంది.
అవసరం ఉన్నా, లేకపోయినా సమంత అందాల ఆరబోతలో తగ్గేది కాదు. ఈమధ్యన సమంత పై డేటింగ్ రూమర్స్ కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ దర్శకుడు రాజ్ తో సమంత డేటింగ్ చేస్తూ సోషల్ మీడియా కోడై కూస్తుంది. తాజాగా సమంత డీసెంట్ లుక్ లో దర్శనమిచ్చింది.
చక్కటి మోడ్రెన్ లుక్ లో సమంత సింపుల్ గా డీసెంట్ గా కనిపించి కనువిందు చేసింది. చాలా రోజుల తర్వాత సమంత అందంగా, అద్భుతంగా కనిపించింది, ఇప్పటివరకు టూ గ్లామర్ షూట్స్ చూడలేకపోయామంటూ కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.