సమంతకు విడాకులిచ్చేసిన నాగ చైతన్య రెండుమూడేళ్లకే తన కొత్త లైఫ్ ని స్టార్ట్ చేసేసాడు. రీసెంట్ గా నాగ చైతన్య శోభితను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆయన హ్యాపినెస్ ఆయన వెతుక్కున్నాడు. లైఫ్ లో సెటిల్ అయ్యాడు. విడాకుల తర్వాత అటు మానసికంగానూ, ఇటు మాయోసైటిస్ తో శారీరకంగానూ సఫర్ అయిన సమంత ప్రస్తుతం షూటింగ్స్ తో బిజిగా మారింది.
అయితే సిటాడెల్ ప్రమోషన్స్ లో రెండో పెళ్లిపై కామెంట్స్ చేసిన సమంత ఆతర్వాత ఫ్యామిలీమ్యాన్, సిటాడెల్ దర్శకుడు రాజు నిడుమోరుతో డేటింగ్ చేస్తుంది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సమయంలోనే వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు రావడమే కాదు, ఫ్యామిలీ మ్యాన్ 3 పార్టీలో కలిసి కనిపించడం ఇంకా హాట్ టాపిక్ అయ్యింది.
తాజాగా చెన్నై చాంపియన్స్‌కు సపోర్ట్ చేస్తున్న సమంత రాజ్ నిడుమోరు చేతి పట్టుకుని కనిపించింది. దానితో సమంత-రాజ్ డేటింగ్ రూమర్స్ మరోసారి హైలెట్ అయ్యాయి. మరి ఈ గుసగుసలు సమంత చెవిన పడకుండానే ఉన్నాయా, ఉంటే ఇంతవరకు ఎందుకు స్పందించలేదు.
అసలే తనపై వచ్చే రూమర్స్ కి సమంత ఫైర్ అవుతూనే సోషల్ మీడియా వేదికగా చెక్ పెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మరి ఈ గుసగుసలపై ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.