Advertisement
Google Ads BL

జగన్ ఫీజు బకాయిల గుట్టు


ఫీజుపోరు లో నువ్వు పెట్టిన బకాయిల కుప్ప గురించి కూడా చెప్పు జగన్ రెడ్డి....

Advertisement
CJ Advs

* ఫిబ్రవరి 5న వైఎస్సార్‌సీపీ చేపట్టే ఫీజుపోరు కార్యక్రమం పోస్టర్‌ను వైసీపీ దొంగల ముఠా అంతాకలిసి విడుదల చేశారు...

* పేద విద్యార్థులు చదువు, ఉద్యోగాలు రాజశేఖర్ రెడ్డి పెట్టిన భిక్ష అని వాగుతున్న జోగి మాటలకు అర్ధం ప్రజలు బిక్షగాళ్లు అనేనా? ప్రజలను బిక్షగాళ్లతో పోలుస్తున్న వైసీపీ నేతలకు అసలు నాయకులుగా కొనసాగే అర్హత లేదు...  

* గతంలో ఉన్న ఫీజు రీయంబర్స్ మెంట్ ని విద్యా దీవెనగా మార్చి తామేదో కొత్తగా ఈ పధకాన్ని సృష్టించినట్లు  సిగ్గులేకుండా జగన్ రెడ్డి ప్రచారం చేసుకున్నాడు.

* గతంలో విద్యార్ధుల తరపున పూర్తి ఫీజులు నేరుగా కళాశాల యాజమాన్యాలకే ప్రభుత్వం  అందజేసింది. కానీ జగన్ రెడ్డి మాత్రం ప్రచార్బాటంతో విద్యా దీవెన అంటూ విద్యార్ధుల్ని, వారి తల్లితండ్రుల్ని మోసం చేశాడు.  

* ఆ ఇచ్చేది కూడా పోనీ సకాలంలో ఇచ్చాడా అంటే ఎప్పుడు ఖాతాలో ఎప్పుడు వేసావాడో తెలియదు,  కళాశాల యాజమన్యాలు విద్యార్ధుల్ని వేధించాయి. కొన్ని చోట్ల హాల్ టిక్కెట్లు నిలిపివేసి,  పరీక్షలు రాయనీయ్యమంటూ  విద్యార్దుల్ని ఇబ్బందులకు గురి చేశాయి.

* దిగిపోయే ముందు కూడా బటన్ నొక్కి డ్రామా ఆడాడు, బకాయిల కుప్ప పెట్టి పోయాడు...  

* 2014-2019 టీడీపీ పాలనలో ఏటా 16 లక్షల మంది విద్యార్ధులకు ఫీజ్ రీయంబర్స్ మెంట్ చేస్తే జగన్ రెడ్డి పాలనలో కేవలం 9 లక్షల మందికి అది కూడా విడతల వారీగా ఇచ్చి, దాదాపు 7 లక్షల మంది పేద విద్యార్ధులను మోసగించి ఇంకా సిగ్గులేకుండా మాట్లాడతారా?

* విద్యా దీవెన అని గొప్పలు చెప్పి తల్లిదండ్రులతో అప్పులు చేయించి విద్యార్థులను ముప్పు తిప్పలు పెట్టి వారిని మానసిక క్షోభ పెట్టిన నీచుడు జగన్మోహన్ రెడ్డి

* వైసీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిల వలన డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌, ట్రిపుల్‌ ఐటీ, ఇతర కోర్సులు పూర్తి చేసిన ఉన్నత విద్య చదివే అవకాశం లేక పలువురు, ఉద్యోగావకాశాలు కోల్పోయి మరికొందరు విద్యార్థులు సతమతమయ్యారు.... ఏ మొహం పెట్టుకుని ధర్నా చేస్తున్నారు?

* మీ దరిద్రపు పాలనలో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రాకపోవడంతో 2022లో శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ఓ యువతి... ఒకటో పట్టణ పోలీస్  స్టేషన్ ముందే కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది నిజామా కాదా?

* 2021-22 4వ క్వార్టర్‌ నగదు విడుదల చేయకపోవడంతో విజయవాడలోని ఓ కాలేజీ రూ.60 వేల ఫీజు కట్టాలని ఓ విద్యార్థికి కాలేజీ యాజమాన్యం తాఖీదు ఇచ్చింది లేదంటే పరీక్షలు రాయనీయబోమని ఇబ్బంది పెట్టింది నిజామా కాదా?

* చిత్తూరు జిల్లాలోని ఓ ప్రముఖ కాలేజీకి గత ప్రభుత్వం రీయింబర్స్‌ మెంట్‌ నిధులను బకాయి పెట్టడంతో 2018-19లో పూర్తిచేసిన కోర్సుకు సంబంధించిన రూ.57 వేల ఫీజు బకాయిని 15 రోజుల్లో చెల్లించాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కాలేజీ నుంచి లీగల్‌ నోటీసు అందింది నిజామా కాదా? విద్యార్థులను ఫీజు కోసం లీగల్ నోటీసులు అందుకునేలా చేసిన మీరా ధర్నాలు చేసేది?  సిగ్గు అనే మాటకు అర్ధం తెలుసా మీకు?

* డిసెంబర్ 17, 2023న నెల్లూరు జిల్లా కావలిలో ఫీజ్ రీయింబర్స్ మెంట్ డబ్బులు అందలేదని దాదాపు 30 మంది  ఫైనల్ ఇయర్ నర్సింగ్ విద్యార్ధులను నర్సింగ్ కళాశాల బయటకు పంపేసింది నిజామా కాదా? వైసీపీ దొంగ ముఠా వీటికి సమాధానం చెప్పాలి....

* ఇవ్వని ఫీజులకు కూడా పెద్ద పెద్ద పేపర్ ప్రకటనలు ఇచ్చుకుని బాకా కొట్టుకుంది మీరు కాదా?

* ఫీజు రీయింబర్స్‌మెంట్‌ -​రూ.2,832 కోట్లు

వసతి దీవెన బకాయిలు - ​రూ.989 కోట్లు

పీజీ ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌ -​రూ.450 కోట్లు బకాయిల కుప్పపెట్టి, అందినకాడికి దోచుకుని, బెంగళూరు ప్యాలస్ లో కూర్చొని నీచరాజకీయాలు నడుపుతున్న వైసీపీ దొంగల ముఠా నాయకుడు జగన్ రెడ్డి తాను పెట్టిన బకాయిల గురించి, దోపిడీ గురించి సమాధానం చెప్పాలి....  

* ఎలాంటి అవాంతరాలు లేకుండా కాలేజీలకే నేరుగా ఫీజులు చెల్లించే విధానాన్ని మార్చేసి తల్లుల ఖాతాలకే అని నీ రాజకీయ అవసరం కోసం విద్యార్థులను ఇబ్బంది పెట్టలేదా జగన్ రెడ్డి?

* ఆ ఫీజులు కూడా విడతల వారీ చెల్లింపులు అన్నాడు, కాలేజీలు అంగీకరించకపోవడం వలన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్ధులను పెద్ద కాలేజీలకు దూరం అయ్యారు... ఈ పాపం నీది కాదా జగన్ రెడ్డి?

* 5 ఏళ్లకు ఏడాదికి  4 విడతలు ఎగ్గొట్టి కేవలం ఫీజులకే రూ.4,271 కోట్లబకాయిలు పెట్టిన నువ్వు కాదా అసలు 420 జగన్ రెడ్డి?

* ఇప్పటికే కూటమి ప్రభుత్వం రూ.788 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసింది.

* వివిధ కళాశాలల్లో నిలిచిపోయిన 10లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లను విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకున్నది...

* విద్యార్థులను ఫీజు కోసం ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని కాలేజీలకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది.  

* రైతుపోరు అన్నాడు, అట్టర్ ఫ్లఅప్ అయింది, అయినా సిగ్గులేని రాజకీయ నేత జగన్ రెడ్డికి బుద్ది రాదు... ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని చూస్తే సైకోకి మనశ్శాంతి లేదు.... ప్రజల చేత పేడ నీళ్లు మొహం మీద కొట్టించుకునే దాకా ఆ పార్టీ అధినేతకు బుద్ది రాదు... నేతలకు రాదు...

Jagan Mohan Reddy:

Jagan Reddy also tell me about the pile of dues you paid in the fee war....
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs