నందమూరి బాలకృష్ణకు ప్రతిష్టాత్మక అవార్డు పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా ఆయన చెల్లి, సీఎం గారి భార్య నారా భువనేశ్వరి నందమూరి-నారా కుటుంబ సభ్యులతో పాటుగా సినీ, రాజకీయ ప్రముఖులకు హైదరాబాద్ లో గత రాత్రి పార్టీ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. బాలయ్యకు పద్మభూషణ్ వచ్చిన సంతోషంతో ఆయన చెల్లి ఇచ్చిన పార్టీకి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ముఖ్యగా సీఎం చంద్రబాబు, బాలయ్య తో పని చేసిన దర్శకనిర్మాతలు, ఇంకా కొంతమంది స్పెషల్ గెస్ట్ లు ఈపార్టీలో సందడి చేసిన విషయం ఆయా దర్శకులు షేర్ చేస్తున్న బాలయ్య పార్టీ పిక్స్ చూస్తే తెలుస్తోంది. థమన్ తో చంద్రబాబు దిగిన పిక్ దగ్గర నుంచి ఆయన బాలయ్య గురించి మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి.
ఇప్పటివరకు అల్లరి బాలయ్యని చూసాం, ఇప్పటినుంచి పద్మభూషణ్ బాలయ్యను చూస్తాం, ఆ అవార్డు ఎంతో ప్రతిష్ట్మాకం, చరిత్ర సృష్టించాలంటే క్రమశిక్షణ ఏంతో అవసరం, బాలయ్య పైకి అల్లరిగా కనిపించినా ఆయనకి క్రమశిక్షణ ఉంటుంది. ఒక్కోసారి బాలయ్య ఉదయం 3గంటలకే నిద్ర లేచి పూజ చేస్తాడు. నేను షాకవుతుంటాను. 50 ఏళ్ళ వయసులోనూ సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్నారు అంటూ చంద్రబాబు బావమరిది బాలయ్య గురించి మాట్లాడారు.